USA: ఇరాన్, ఇరాక్ గగన తలాలపై విమానాల ప్రయాణాన్ని నిషేధించిన అమెరికా!
- సముద్ర జలాలు కూడా వాడవద్దు
- ఫెడరల్ ఏవియేషన్ ప్రకటన
- పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తత
తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన అనంతరం అమెరికా స్పందించింది. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ గగనతలం మీదుగా యూఎస్ విమానయాన సంస్థల విమానాలేవీ ప్రయాణించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్, సౌదీ అరేబియా సముద్ర జలాలపైనా ప్రయాణాలు సాగించవద్దని ఆదేశించింది.
కాగా, ఇరాక్ లోని రెండు అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్ లపై ఇరాన్ 12 మిసైళ్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న ట్రంప్, ఇరాన్ తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఈ ఉదయం టెహ్రాన్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.