Sensex: యుద్ధభయం నేపథ్యంలో.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు
- 51 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 27 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాందోళనలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రాంభమైన వెంటనే సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్యే మార్కెట్లు ఈరోజు మొత్తం నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్ల నష్టంతో 40,817కి పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 12,025 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.74%), టీసీఎస్ (2.49%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.62%), బజాజ్ ఫైనాన్స్ (1.06%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.92%).
టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.12%), ఓఎన్జీసీ (-1.71%), సన్ ఫార్మా (-1.67%), టైటాన్ కంపెనీ (-1.32%), టెక్ మహీంద్రా (-1.29%).