Tirumala: తిరుమలలో కనిపించని రద్దీ... ఒకే కంపార్టుమెంట్ లో భక్తులు!

  • 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం
  • ధనుర్మాసం కారణంగా అధ్యయనోత్సవాలు
  • రేపు పౌర్ణమి గరుడ సేవ రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు సర్వ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో దివ్య దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు, ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందిన భక్తులు మాత్రం స్వామి దర్శనం కోసం భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు.

ఇదిలావుండగా, ధనుర్మాసం కారణంగా ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉండగా, రేపు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 65 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు రూ. 3 కోట్ల మేరకు హుండీ ఆదాయం లభించింది. సంక్రాంతి సెలవులు ముగిసేంత వరకూ రద్దీ సాధారణ స్థాయిలోనే ఉండవచ్చని భావిస్తున్నట్టు టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News