Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్షపై స్పందించిన యువరాజ్ సింగ్
- తీర్పు చెప్పిన కోర్టుకు వందనం
- ఇప్పుడు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుంది
- కోర్టు తీర్పును ప్రజలు, ప్రముఖులు హర్షిస్తున్నారు
నిర్భయ దోషులకు పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. నిర్భయ కేసులో ఏడేళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పుపై యువరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు న్యాయం జరిగిందన్నాడు. కోర్టు తీర్పును ప్రజలు, ప్రముఖులు హర్షిస్తున్నట్టు పేర్కొన్నాడు. తీర్పు చెప్పిన ఢిల్లీ కోర్టుకు వందనమన్నాడు. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా, పాటియాలా కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 22న ఉదయం ఏడు గంటలకు నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరి తీయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే తీహార్ జైలులో జరుగుతున్నాయి.