Pawan Jaladi: వాళ్లను ఉరి తీస్తే వచ్చే డబ్బుతోనే నా కుమార్తె పెళ్లి జరిపిస్తా: 'నిర్భయ దోషుల' తలారి

  • ప్రస్తుతం మీరట్ లో ఉంటున్న పవన్ జలాద్
  • తీహార్ జైలుకు రావాలని పిలుపు
  • ఒక్కో ఉరికి రూ. 25 వేలు
  • నలుగురిని ఉరితీస్తే రూ. లక్ష

"ఈ నెల 22వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. బహుశా ఎల్లుండి నన్ను ఇక్కడి నుంచి తీహార్ జైలుకు తీసుకుని వెళతారు. నాకిప్పుడు డబ్బుల అవసరం ఎంతో ఉంది. ఆ దోషులను నేను ఉరి తీస్తే వచ్చే డబ్బుతోనే నా కుమార్తె వివాహం జరిపించాల్సి వుంది" అని నిర్భయ కేసులో మరణదండన ఎదుర్కోనున్న నలుగురు దోషులను ఉరి తీసేందుకు అధికారులు ఎంచుకున్న పవన్ జలాద్ వ్యాఖ్యానించాడు.

వారిని ఉరి తీసే అవకాశం తనకు లభించడమే దేవుడిచ్చిన వరమని భావిస్తున్నట్టు మీరట్ జైల్లో తరతరాలుగా తలారులుగా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన 57 ఏళ్ల పవన్ చెప్పుకొచ్చాడు. వారిని ఉరి తీస్తే, తనకు లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తుందని, దానితో తన కుమార్తె వివాహం జరిపిస్తానని అన్నాడు. ఈ అవకాశం కోసం తాను ఎన్నో నెలలుగా వేచి చూస్తున్నానని చెప్పాడు.

మీరట్ అధికారులు తనకు కాన్షీరామ్ ఆవాస్ యోజన కింద ఒక గది ఇంటిని కేటాయించారని, అదిప్పుడు చాలడం లేదని చెప్పిన పవన్, ఇప్పటికే యూపీ జైలు అధికారుల నుంచి నిర్భయ దోషుల ఉరితీతపై సమాచారం అందిందని, ఉరికి ముందు తాను రిహార్సల్స్ చేయాల్సి వుందని అన్నాడు.

ప్రస్తుతం తనకు నెలకు కేవలం రూ. 5 వేలు మాత్రమే యూపీ జైలు అధికారులు వేతనంగా ఇస్తున్నారని, ఇది కుటుంబ నిర్వహణకు ఎంత మాత్రమూ సరిపోవడం లేదని అన్నాడు. ఇంటిని మరమ్మతులు చేసుకుందామన్నా డబ్బులేదని, దోషులను ఉరితీస్తే వచ్చిన డబ్బు తనకు కొత్త ఊపిరిని ఇస్తుందని నమ్ముతున్నానని చెప్పాడు.

ఒకరిని ఉరి తీస్తే ఇప్పుడు రూ. 25 వేలు ఇస్తున్నారని చెప్పాడు. తన తాత కల్లూరామ్ కు ఒక్కో ఉరికి రూ. 200 ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. 1989లో ఓ దోషిని ఉరితీసేందుకు ఆగ్రా సెంట్రల్ జైలుకు తాను తాతతో కలిసి వెళ్లానని, దోషి కాళ్లకు తాను తాడు కట్టగా, తన తాత ఉరి తీశాడని చెప్పాడు. ఇందిరాగాంధీ హత్య కేసు దోషులు సత్వంత్ సింగ్, కేహార్ సింగ్ లను తన తండ్రి మమ్మూ జలాద్, తాత కల్లూరామ్ లు కలిసి ఉరితీశారని తెలిపాడు.

ఈ సందర్భంగా పవన్ జలాద్ మరో విషయాన్ని కూడా చెప్పాడు. 'తాను ఇంతవరకు అసలు మందు అన్నదే ముట్టలేదని అన్నాడు. 'ఎవరినైనా ఉరి తీసే ముందు తలారి మందు కొట్టి వస్తాడని బయట అందరూ అనుకుంటూ వుంటారు. ఇందులో వాస్తవం లేదు. నాకసలు మందు అలవాటే లేదు' అని చెప్పాడు.

  • Loading...

More Telugu News