F-35: ఇరాన్ దూకుడుని ఎదుర్కోవడానికి... ఎఫ్-35 విమానాలను సిద్ధం చేసిన అమెరికా!

  • 24 గంటల వ్యవధిలో రెండో దాడి
  • ఎలిఫెంట్ వాక్ చేసిన ఎఫ్-35 విమానాలు
  • వార్ షిప్ లపైకి తరలింపు

ఇరాక్ లోని అమెరికా ఆస్తులు, సైనిక స్థావరాలపై 24 గంటల వ్యవధిలో రెండో సారి దాడి జరగడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. వెంటనే ఎఫ్-35 విమానాలను బయటకు తీయాలని రక్షణ శాఖ ఆదేశాల మేరకు, కొద్దిసేపటి క్రితం అత్యాధునిక యుద్ధ విమానాల 'ఎలిఫెంట్ వాక్' జరిగింది.

 పసిఫిక్ మహాసముద్రంలోని యూఎస్ వార్ షిప్ లపైకి వీటిని తక్షణం తరలించాలని, వార్ షిప్ లపై ఉన్న ఫైటర్ జెట్స్ సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇక తాజా క్షిపణి దాడులతో అమెరికాకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఆ తరువాత దానిపై తాను స్పందిస్తానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, ఉగ్రవాద దేశంగా మారిన ఇరాన్ పై యూఎస్ చేసే పోరులో తాము పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ఇజ్రాయిల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News