India: ఈ ఏడాది కొత్త పంథాలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచన
- కేంద్ర క్యాబినెట్ కమిటీ ప్రతిపాదన
- జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత
- మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు తుది విడత బడ్జెట్ సమావేశాలు
కేంద్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణలో ఈ ఏడాది మార్పు చోటుచేసుకునేలా వుంది. ఈసారి రెండు దఫాలుగా బడ్జెట్ సమావేశాలు జరపాలని కేంద్రం భావిస్తోంది జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 మధ్యలో రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు చేపడతారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, ఆపై మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు మలివిడత సమావేశాలు జరుగుతాయి. తొలి విడత సమావేశాలు ముగియగానే వివిధ మంత్రిత్వ శాఖలకు ఆర్థిక కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర క్యాబినెట్ కమిటీ ప్రతిపాదించింది.