Andhra Pradesh: నేటితో ఈశాన్య రుతుపవనాలకు సెలవు!

  • గతేడాది అక్టోబరులో ఏపీలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
  • రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు
  • భారీ వర్షాలు లేకపోవడంతో పంటలకు తప్పిన ముప్పు

గతేడాది అక్టోబరు 16న దక్షిణాదిలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు నేటితో బై బై చెప్పనున్నాయి. సాధారణంగా ఈ రుతుపవనాల వల్ల ఏపీ, తమిళనాడు ప్రాంతాల్లో కనీసం రెండుమూడు తుపాన్లు అయినా రావడం పరిపాటి. అయితే, ఈసారి మాత్రం ఒక్క తుపానుకే పరిమితమైనా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై దాని ప్రభావం కనిపించలేదు. రుతుపవనాల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఒకే ఒక్క తుపాను పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటింది.

తుపాన్లు ఏపీ తీరాన్ని తాకకపోవడంతో నవంబరు, డిసెంబరు నెలల్లో భారీ వర్షాలు కురవలేదు. ఫలితంగా పంటలకు నష్టం వాటిల్లలేదు. ఇక, ఈశాన్య రుతుపవనాల సీజన్ అయిన అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఏపీలో మొత్తంగా చూసుకుంటే సాధారణ వర్షపాతం నమోదు కాగా, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News