Nara Lokesh: పాకిస్థాన్ బోర్డర్ లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరు: నారా లోకేశ్

  • రాజధాని గ్రామాలు బోర్డర్ ను తలపిస్తున్నాయి
  • జగన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు
  • ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుంది

రాజధానిని తరలించవద్దనే డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. మరోవైపు, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున బలగాలను మోహరింపజేసింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.

రాజధాని గ్రామాలు బోర్డర్ ను తలపిస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. పాకిస్థాన్ బోర్డర్ లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరని మండిపడ్డారు. అన్యాయంగా, పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని, యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. దీంతోపాటు, రాజధాని ప్రాంతంలో భారీ సంఖ్యలో కవాతు చేస్తున్న పోలీసుల వీడియోను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News