Finland: పని దినాల తగ్గింపు ప్రతిపాదన.. ఫిన్లాండ్ ప్రధానికి ప్రజల నుంచి విశేష మద్దతు!

  • ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వారి హక్కు
  • రోజుకు ఆరు గంటల పని వేళలు చాలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఫిన్లాండ్ వాసులు

వారానికి ఐదు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేకపోతున్నారని, కాబ్టటి నాలుగు రోజుల పనిదినాలు చాలని ఫిన్లాండ్ ప్రధాని సనా మెరిన్ ప్రతిపాదించారు. అంతేకాదు, ప్రస్తుతం 8 గంటలుగా ఉన్న పనిదినాలను ఆరు గంటలకు కుదించాలని కూడా ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వారి హక్కు అని తెలిపారు. కార్యాలయ పనులతోపాటు ఇష్టమైన వారితో గడపడం, అలవాట్లను కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యమన్నారు.

ప్రస్తుతం ఫిన్లాండ్‌లో వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు కాగా, పని గంటలు మాత్రం ఇతర దేశాల్లో మాదిరిగానే 8 గంటలుగా ఉంది. ఉద్యోగులపై పనిభారం తగ్గించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆ దేశ విద్యాశాఖ మంత్రి లీ అండర్సన్.. ప్రధాని ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ప్రధాని మెరిన్ ప్రతిపాదనకు మంత్రి మండలిలో ఆమోదం లభించిన వెంటనే పనిదినాలు మారిపోనున్నాయి.

వారానికి నాలుగు రోజుల పనిదినాల విధానాన్ని ఇప్పటికే ఫ్రెంచ్‌లో అమలు చేస్తున్నారు. స్వీడన్‌లో 2015 నుంచే ఆరు గంటల పనిదినాల విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఉత్పాదకత పెరుగుతోందని చెబుతున్నారు. ప్రధాని తాజా ప్రతిపాదనపై ఫిన్లాండ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టులు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News