school: బడిలోకి దెయ్యాలు వస్తున్నాయట.. క్షుద్రపూజలు చేసి కలకలం రేపిన వైనం
- వరంగల్ రూరల్ జిల్లా శంభునిపల్లిలో ఘటన
- గ్రామ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
- ప్రధానోపాధ్యాయురాలి తీరుపై విమర్శలు
చదువుకుంటే మూఢ నమ్మకాలు పోతాయి.. చదువుకోసం బడికి వెళ్లాలి. అయితే, బడులే మూఢ నమ్మకాలను పెంచుకోవడానికి మొదటిమెట్టుగా నిలిస్తే..? వరంగల్ రూరల్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఇదే తీరు కనపడుతోంది. ఆ బడిలో ప్రధానోపాధ్యాయురాలు మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తోంది.
అక్కడ జరిగిన విషయాన్ని గురించి తెలుసుకుంటే ఈ విషయాన్ని ఎవరైనా నిజమేనంటారు. తమ బడికి దెయ్యాలు, భూతాలు వస్తున్నాయంటూ మూఢనమ్మకంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యుడితో క్షుద్ర పూజలు చేయించి కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయురాలే ఇలా వ్యవహరిస్తే ఇక విద్యార్థులు ఏ మార్గంలో వెళతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.