West Bengal: పశ్చిమబెంగాల్ లో ప్రధానికి ఘనస్వాగతం.. మోదీతో మమత బెనర్జీ భేటీ

  • కోల్ కతాలో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని
  • ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లిన మోదీ
  • విమానాశ్రయం వద్ద విద్యార్థి సంఘాల నిరసనలు

కేఓపీటీ 150వ వార్షికోత్సవంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం కోల్ కతాకు ప్రధాని నరేంద్రమోదీ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీని మర్యాదపూర్వకంగా సీఎం మమత బెనర్జీ కలిశారు.

ఈ భేటీ అనంతరం, మీడియాతో మమత మాట్లాడుతూ, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ ఆర్పీ), జాతీయ జనాభా జాబితా(ఎన్ ఆర్పీ) పై తాము అసంతృప్తిగా ఉన్న విషయంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కాగా, మోదీ రాకను నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విమానాశ్రయం వద్ద మోదీకి వ్యతిరేకంగా బ్యానర్లు కట్టారు. ‘గో బ్యాక్ మోదీ’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబూనిన విద్యార్థులు తమ నిరసనలు తెలిపారు.

  • Loading...

More Telugu News