janasena: జగన్... మీకు ఆ దమ్ముందా?: జనసేన సవాల్
- పృథ్వీరాజ్ తో రాజీనామా చేయించారు
- ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించగలరా?
- ట్విట్టర్ లో ప్రశ్నించిన జనసేన పార్టీ
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని నానా మాటలూ అన్న తన పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించే దమ్ము, సీఎం జగన్ కు ఉందా? అని జనసేన పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. "మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన పృథ్వీరాజ్ చేత రాజీనామా చేయించిన జగన్ రెడ్డికి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని చెప్పలేని బూతులతో దుర్భాషలాడి, కాకినాడలో అల్లర్లు చేయించిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించే దమ్ముందా?" అని ప్రశ్నించింది.