Kalyan Ram: వినోదమే ప్రధానాంశంగా 'ఎంత మంచివాడవురా'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- బంధాలు .. అనుబంధాలకు పెద్ద పీట
- ప్రత్యేక ఆకర్షణగా గోపీసుందర్ సంగీతం
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా 'ఎంత మంచివాడవురా' రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో బంధాలు .. అనుబంధాల విలువను చాటి చెబుతూ, పూర్తి వినోదభరితంగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు.
ఈ సినిమాలో హీరో చేసే పనులు ఆయనకి తెలియకుండానే విలన్ కి మంచి చేస్తూ ఉంటాయట. అలాగే హీరో తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా కొంతమంది దుర్మార్గులకు మంచి జరుగుతుంది. ఆ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న హీరో, తన వలన జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ, జనానికి ఉపయోగపడుతూ 'ఎంత మంచివాడవురా' అనిపించుకుంటాడట. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు పూర్తి హాస్యభరితంగా వుంటాయని అంటున్నారు. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.