Pawan Kalyan: పవన్ మామ పంపిన సందేశంతో పరవశించిపోయిన సాయిధరమ్ తేజ్

  • హిట్ టాక్ తెచ్చుకున్న ప్రతిరోజు పండగే చిత్రం
  • మేనల్లుడ్ని అభినందిస్తూ పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్
  • మాటలు రావడం లేదంటూ సాయితేజ్ 
మెగా హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకుంటున్న సాయిధరమ్ తేజ్ తాజాగా 'ప్రతిరోజు పండగే' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస పరాజయాలతో నిరాశకు లోనైన సాయితేజ్ కు 'చిత్రలహరి' విజయంతో మళ్లీ ఊపొచ్చింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో, సాయితేజ్ కు పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ మెసేజ్ వచ్చింది. తన మేనమామ నుంచి వచ్చిన ఆ సందేశాన్ని సాయితేజ్ సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నాడు.

"ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ పవన్ సందేశం పంపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ, మాటలు రావడం లేదని ట్వీట్ చేశాడు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుందని, "లవ్యూ పవన్ కల్యాణ్ మామా" అంటూ తన హర్షం వెలిబుచ్చాడు.
Pawan Kalyan
Sai Dharam Tej
Pratiroju Pandage
Tollywood
Social Media

More Telugu News