Ala Vaikunthapuramulo: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కెరీర్ లో ఇదే టాప్.... 'అల... వైకుంఠపురములో' వసూళ్ల రికార్డు

  • తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.85 కోట్ల గ్రాస్
  • బన్నీ సినిమాల్లో ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్
  • అత్యధిక తొలిరోజు కలెక్షన్లు సాధించిన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా ఘనత
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం 'అల... వైకుంఠపురములో'. జనవరి 12న ఆదివారం నాడు రిలీజైన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోనూ హంగామా చేస్తోంది. తాజాగా 'అల... వైకుంఠపురములో' ఓపెనింగ్ కలెక్షన్లపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది.

ఈ ఫ్యామిలీ ఎంటర్టయినర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అంతేకాదు, దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రాలేవీ ఈ స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు సాధించలేదంటే 'అల... వైకుంఠపురములో' సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోందో అర్థమవుతోంది. అంతేకాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన అల్లు అర్జున్ చిత్రం కూడా చేరింది.
Ala Vaikunthapuramulo
Allu Arjun
Trivikram
Tollywood
Openings
Box Office
Collections

More Telugu News