Mushraf: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణశిక్షను రద్దు చేసిన హైకోర్టు
- 2013లో ముషారఫ్ పై దేశ ద్రోహం కేసు నమోదు
- గత డిసెంబర్ 17న మరణశిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం
- ఈ తీర్పును కొట్టేసిన లాహోర్ హైకోర్టు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తున్నట్టు ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ముషారఫ్ కు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు వీలులేదని, చట్ట ప్రకారం ఆ నిబంధనలు లేవని ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ పేర్కొందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అసలు ప్రత్యేక కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించిందని, ఈ ఆదేశాల మేరకు ముష్రారఫ్ కు మరణశిక్ష రద్దయిందని చెప్పారు. కాగా, 2013 డిసెంబరులో ముషారఫ్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. గత ఏడాది డిసెంబర్ 17న ముషారఫ్ కు మరణశిక్ష విధించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.