galla jaydev: మహిళలను ఇష్టమొచ్చినట్లు కొట్టి మంచినీళ్లు ఇవ్వకుండా వేధించారు: గల్లా జయదేవ్
- మహిళలపై పోలీసుల చర్యలు దారుణం
- శాంతియుత ఆందోళనకు అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పింది
- ఇది అమరావతి సమస్య మాత్రమే కాదు.. రాష్ట్ర సమస్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పోలీసులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు గుప్పించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో అమరావతి రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ, వామపక్షాలు, జనసేన, ఆప్ నేతలు పాల్గొన్నారు. అనంతరం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు.
మహిళలను ఇష్టమొచ్చినట్లు కొట్టి మంచినీళ్లు ఇవ్వకుండా వేధించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. మహిళలపై పోలీసుల చర్యలు దారుణమని విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా ఆందోళనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పిందని ఆయన అన్నారు. ఇది అమరావతి సమస్య మాత్రమే కాదని, ఇది రాష్ట్ర ప్రజల సమస్య అని చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు కోసం అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆయన అన్నారు.