IAS-IPS: ఆరుగురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు !
- ఎస్సీ, ఎస్టీ లపై తప్పుడు నివేదికలు సమర్పించారని కేసు
- కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం
- సైఫాబాద్ పీఎస్ లో కేసులు నమోదు
ఆరుగురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తెలంగాణలోని ఇద్దరు మాజీ ఐపీఎస్ లు, నలుగురు మాజీ ఐఏఎస్ లు ఎస్సీ, ఎస్టీ కేసులో తప్పుడు నివేదికలు సమర్పించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. కేసులు నమోదైన వారిలో మాజీ ఐపీఎస్ లు దినేశ్ రెడ్డి, కేఎల్ఎన్ రాజుతో పాటు మాజీ ఐఏఎస్ లు ఎస్వీ ప్రసాద్, పి.కె. మహంతి, రత్నప్రభ, విద్యాసాగర్ లు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసులో కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించారంటూ వత్స అనే మహిళ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు దీనిపై విచారణ జరిపి వీరిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సైఫాబాద్ పోలీసులు వీరిపై ఐపీసీ 201, 203,204,213,193 రెడ్ విత్ యాక్ట్ 34, 120బితో పాటు సీఆర్పీసీ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.