Andhra Pradesh: డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించిన రాజధాని రైతులు, మహిళలు
- అమరావతి కోసం ఆందోళనలు
- రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు
- పోలీసుల దాడులు, కేసుల గురించి మాట్లాడిన రైతులు
ఏపీ రాజధాని మార్పు ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టడం తెలిసిందే. గత నాలుగు వారాలుగా రైతులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్లలో కంటే ధర్నా శిబిరాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో రాజధాని రైతులు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న తమపై పోలీసుల దాడులు జరగడంపైనా, కేసులు నమోదు చేయడంపైనా వారు డీజీపీతో చర్చించారు. దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించారు. కేసులు, దాడుల అంశాన్ని పరిశీలిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.