Ukrain: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 30 మంది అరెస్ట్
- లోతైన విచారణ జరిపించాము
- వీరికి కఠిన శిక్ష తప్పదు
- వెల్లడించిన ఇరాన్ న్యాయవిభాగం
ఉక్రెయిన్ కు చెందిన విమానాన్ని కూల్చివేసిన ఘటనలో 30 మందిని అరెస్ట్ చేశామని ఇరాన్ న్యాయ విభాగం ప్రకటించింది. జరిగిన ఘటనపై లోతైన విచారణ జరిపించామని, ఆపై బాధ్యులను అదుపులోకి తీసుకున్నామని, వీరికి కఠిన శిక్ష తప్పదని ప్రభుత్వ అధికార ప్రతినిధి గులాం హుస్సేన్ ఇస్మాయిలీ వెల్లడించారు.
కాగా, విమానం కూల్చివేతను సీరియస్ గా తీసుకుంటున్నామని, కేసులో నిందితులకు శిక్ష తప్పదని అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించిన కొద్దిసేపటికే గులాం అరెస్ట్ ల గురించి మీడియాకు తెలిపారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు ముఖ్యకారణమని, అయినా, తమ వల్ల జరిగిన తప్పును సమర్థించుకోవడం లేదని అన్నారు. గతవారం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ బయలుదేరిన విమానంపై ఇరాన్ పొరపాటున క్షిపణిని ప్రయోగించగా, అది కూలిపోయి 176 మంది మరణించిన సంగతి తెలిసిందే.