Rajinikanth: జర్నలిస్టులపై చాలా బాధ్యత ఉంటుంది.. అలా చేయకండి: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

  • మీడియా ఎవరి పక్షాన ఉండకూడదు
  • తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉంది
  • కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీల పట్ల పక్షపాత ధోరణితో ఉన్నాయి
  • సత్యమేదో ఆ విషయాన్నే మీడియా తెలపాలి 

రాజకీయాలు, సమాజం చెడు మార్గంలో వెళుతోన్న సమయంలో ప్రజల సంక్షేమం కోసం మీడియాపై చాలా బాధ్యత ఉంటుందని సినీనటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... మీడియా ఎవరి పక్షాన ఉండకుండా తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని టీవీ చానళ్లు కొన్ని రాజకీయ పార్టీల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని చెప్పారు.

మీడియా, విమర్శకులు, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా నిజాన్ని చెప్పాలని రజనీకాంత్ అన్నారు. సత్యంతో కూడిన వార్తని పాలతోనూ, అసత్యాలతో కూడిన వార్తని ఆయన నీళ్లతోనూ పోల్చుతూ.. ఈ పాలు, నీళ్లను కలిపి చూపెడితే ఈ రెండింటి మధ్య తేడాలను ప్రజలు గుర్తించలేరని తెలిపారు. సత్యమేదో ఆ విషయాన్నే మీడియా తెలపాలని, నిజం, అబద్ధం.. రెండింటినీ కలిపి అసత్యాన్ని నిజం చేసి చూపకూడదని చెప్పారు.

  • Loading...

More Telugu News