Nirbhaya: నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమన్న ఢిల్లీ ప్రభుత్వం!
- రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన దోషి ముఖేశ్ సింగ్
- రాష్ట్రపతి నిర్ణయం వచ్చేవరకు ఉరి నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
- నిస్సహాయత వ్యక్తం చేసిన ఢిల్లీ సర్కారు
నిర్భయ దోషులను మరికొన్నిరోజుల్లో ఉరితీస్తారన్న నేపథ్యంలో దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి దరఖాస్తు సమర్పించడం తెలిసిందే. అంతేకాదు, రాష్ట్రపతి నిర్ణయం వచ్చేవరకు ఉరి నిలుపుదల చేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో, తాము జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. రాష్ట్రపతి నిర్ణయం రాకముందే ఉరి అమలు చేయడం జైలు నిబంధనలకు వ్యతిరేకమని తెలిపింది. మరోవైపు, తీహార్ జైలు అధికారులు కూడా కోర్టులో తమ వాదనలు వినిపించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినా జైలు నిబంధనల ప్రకారం దోషులను ఉరితీయడానికి ముందు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.