Tirumala: భక్తులతో నిండిపోయిన తిరుమల.. దర్శనానికి ఆలస్యం
- వరుస సెలవులతో రద్దీ
- చలికి ఇబ్బందులు పడుతున్న భక్తులు
- దర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో స్వామి దర్శనానికి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అద్దె గదులు లభించక, వేలాది మంది ఆరుబయట షెడ్లలో వుంటూ, చలికి వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వామి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వుండగా, ఈ ఉదయం దర్శనం కోసం వచ్చే వారికి రాత్రి 8 గంటల తరువాత దర్శనం చేయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం నాడు స్వామిని 83,077 మంది భక్తులు దర్శించుకోగా, 29,329 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 2.67 కోట్లుగా నమోదైంది.