Mahathma Gandhi: మహాత్ముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
- గాంధీజీకి భారతరత్న ఇవ్వాలంటూ పిటిషన్
- విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం
- భారతరత్న కంటే గాంధీజీ గొప్ప వ్యక్తి అని పేర్కొన్న ధర్మాసనం
జాతిపిత గాంధీజీకి భారతరత్న ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీం న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ భారతరత్న పురస్కారం కంటే ఎంతో గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. సాధారణ పౌరులకు ఇచ్చే పురస్కారం గాంధీజీకి అవసరంలేదని, ప్రజల దృష్టిలో ఆయన భారతరత్న కంటే ఎన్నోరెట్లు ఉన్నతమైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ మనోభావాలు తమకు అర్థమయ్యాయని, భారతరత్న కంటే గొప్ప పురస్కారాన్ని గాంధీజీ కోసం సూచించాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషనర్ కు సూచించింది. దీనిపై ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయవచ్చంటూ పిటిషన్ ను కొట్టివేసింది.