Andhra Pradesh: ఏపీ రాజధాని ప్రాంత రైతులు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు పెంపు.. హైకోర్టు ఆదేశాలు

  • రైతులు వేసిన పిటిషన్ పట్ల హైకోర్టు సానుకూలం
  • సోమవారం మధ్యాహ్నం 2.30వరకు గడువు పెంపు
  • చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కు ఆదేశం

రాష్ట్ర రాజధాని అంశంపై పరిస్థితులు ఉత్కంఠగా మారుతున్నాయి. సీఆర్డీఏకు తమ అభిప్రాయాలు తెలిపేందుకు గడువు పెంచాలని రాష్ట్ర హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై టీడీపీ ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపించారు. రైతులు తమ అభ్యంతరాలను చెప్పుకునేందుకు తగిన సమయం ఇవ్వలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇందుకోసం గడువును పెంచాలని కోర్టును కోరారు.

దీనికి స్పందించిన కోర్టు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు గడువును ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కు సూచించింది. రైతులు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా, లిఖితపూర్వంగా, సీఆర్డీఏ వెబ్ సైట్, ఈ మెయిల్ ద్వారా తెలపవచ్చని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.

  • Loading...

More Telugu News