Prithivraj: ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఆడియో టేప్ కేసు.. విచారణకు సహకరించని బాధితురాలు?
- ఫిర్యాదు చేయడానికి ముందుకురాని బాధితురాలు
- ఇప్పటికే అల్లరిపాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడి
- అలా అయితే ఆరోపణలు నిరూపించడం కష్టమంటున్న అధికారులు
ఎస్వీబీసీ ఛైర్మన్గా ఉన్న పృథ్వీరాజ్.. ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చిన కేసు సరికొత్త ట్విస్ట్ తీసుకుంది. పృథ్వీపై ఆరోపణలు చేసిన బాధితురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి విముఖత చూపడంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ ముందుకు సాగడంలేదని తెలుస్తోంది.
తనతో పృథ్వీ ఫోన్లో మాట్లాడాడని చెబుతోన్న మహిళ.. తాను ఇప్పటికే అల్లరిపాలై కష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఆమె మీడియా ముందుకు రావడానికి సైతం ఇష్టపడటంలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు తమ వద్ద నున్న టెలీఫోన్ సంభాషణ టేపులతోనే విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బాధితురాలు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, నిందితుడిపై చర్యలు చేపట్టడం సాధ్యంకాదని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎస్వీబీసీకి ఛైర్మన్ గా ఉన్న పృథ్వీరాజ్ ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.