Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి తీర్మానం
- విశాఖపట్నంలోని ఓ హోటల్లో సమావేశం
- చంద్రబాబు తీరుపై విమర్శలు
- మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు కీలక ప్రకటన చేశారు. ఈ రోజు విశాఖపట్నంలోని ఓ హోటల్లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును సమర్థిస్తూ తీర్మానం చేశారు. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీరు బాగోలేదని అన్నారు. విశాఖలో రాజధాని ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నిస్తుండడం సరికాదని విమర్శించారు.
ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేయడానికే ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితిని స్థాపించామని వారు చెప్పారు. ఏ రాజకీయ పార్టీతో దీనికి సంబంధం లేదన్నారు. అలాగే, అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయాలని వారు అన్నారు.