India: బెంగళూరు వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ... మరో రికార్డు సాధించిన కోహ్లీ
- ఆసీస్ తో వన్డేలో నిలకడగా ఆడుతున్న భారత్
- 31 ఓవర్లలో 1 వికెట్ కు 161 రన్స్
- రోహిత్ శర్మ 103 పరుగులు
బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ లక్ష్యఛేదనలో నిలకడగా పయనిస్తోంది. 287 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 31ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (103 బ్యాటింగ్)మరోసారి అద్వితీయమైన ఆటతీరుతో అలరించాడు. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న హిట్ మ్యాన్ కెరీర్ లో మరో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు కెప్టెన్ కోహ్లీగ్ (32 బ్యాటింగ్) మరో వరల్డ్ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 5000 పరుగులు సాధించిన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కేవలం 82 ఇన్నింగ్స్ ల్లోనే 5 వేల పరుగులు నమోదు చేశాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ధోనీ పేరిట ఉంది. 5 వేల పరుగులు పూర్తి చేయడానికి ఓ కెప్టెన్ గా ధోనీ 127 ఇన్నింగ్స్ లు ఆడాడు.