Prince Harry: రాచరికపు చట్రం నుంచి బయటకు వచ్చేయాలని ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయం

  • హ్యారీ పేరుకు ముందు తొలగిపోనున్న ప్రిన్స్ హోదా
  • రాజకుటుంబం నుంచి విడిపోవాలని హ్యారీ నిర్ణయం
  • కెనడాలో స్థిరపడేందుకు సన్నాహాలు

అత్యంత ప్రాచీన రాజవంశాల్లో బ్రిటన్ రాజకుటుంబం ఒకటి. ఒకప్పటితో పోలిస్తే ఈరోజుల్లో రాచరికం ఓ హోదాగానే మిగిలిపోయింది. అందుకే బ్రిటన్ యువరాజు హ్యారీ తన వ్యక్తిగత జీవితానికి ప్రతిబంధకంగా మారిన రాచరికాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆయన తన అర్ధాంగి మేగాన్ మార్కెల్ తో కలిసి రాచరికపు హోదాతో పాటు అన్ని బిరుదులు త్యజించాలని నిర్ణయించుకున్నారు. రాజకుటుంబం నుంచి విడవడిన తర్వాత హ్యారీ, మేగాన్ కెనడాలో స్థిరపడనున్నారు. ఈ మేరకు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కూడా అంగీకారం తెలిపారు. స్వతంత్రంగా జీవించాలన్న వారి ఆకాంక్షను తాము గౌరవిస్తున్నామని చెప్పారు.

అయితే, రాచరికపు హోదా కింద వారికి అందించిన ప్రజానిధులు 3.1 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని రాజకుటుంబం స్పష్టం చేసింది. ఇక నుంచి హ్యారీ పేరుకు ముందు ప్రిన్స్ అనే బిరుదు తొలగిపోనుంది. వారు సాధారణ పౌరుల మాదిరే జీవించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News