Shirdi: సాయి జన్మస్థలంపై వివాదం... శిరిడీలో బంద్ విరమణ
- సాయి జన్మస్థలం వసతుల కోసం రూ.100 కోట్లు కేటాయించిన సర్కారు
- పథ్రీ సాయి జన్మస్థలం అనేందుకు ఆధారాల్లేవంటున్న శిరిడీ వాసులు
- బంద్ కు పిలుపు
మహారాష్ట్రలోని శిరిడీలో సాయిబాబా జన్మభూమి వివాదం నేపథ్యంలో నిర్వహించిన బంద్ ను విరమించారు. పథ్రీ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ శిరిడీ వాసులు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బంద్ ను విరమిస్తున్నట్టు ప్రకటించారు. రేపు సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
ఇటీవల పర్బని జిల్లాలోని పథ్రీలో సాయి జన్మస్థానం వసతుల కల్పనకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పథ్రీనే సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాలు లేవని శిరిడీ ప్రజలంటున్నారు. అటు, శిరిడీ వాసుల బంద్ కు ప్రతిగా పథ్రీలో పథ్రీ కృతి సమితి బంద్ కు పిలుపునిచ్చింది.