amaravati JAc: హోంమంత్రి ఇంటి ముందు అమరావతి జేఏసీ సభ్యుల బైఠాయింపు

  • రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • ఆలపాటి రాజా తదితరుల అరెస్టు

పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశం, కేబినెట్‌ భేటీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అమరావతి జేఏసీ సభ్యుల తొలి ప్రతిఘటన హోంమంత్రి సుచరితకు ఎదురయ్యింది. గుంటూరులోని ఆమె ఇంటిని ఈరోజు ఉదయం చుట్టుముట్టిన జేఏసీ సభ్యులు అనంతరం ఇంటి ఎదుట బైఠాయించారు.

 మాజీ మంత్రి ఆలపాటి రాజా, డేగ ప్రభాకర్‌, నజీర్‌, గోళ్ల ప్రభాకర్‌ తదితరుల ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు సుచరిత ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్‌ చేశారు. కాసేపటికి పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్టుచేసి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News