Amaravati: మంత్రివర్గం వికేంద్రీకరణ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత
- భారీ ర్యాలీగా బయలుదేరిన గ్రామస్థులు
- అసెంబ్లీ వైపు వెళ్తుంటే అడ్డుకున్న పోలీసులు
- కొందరు తప్పించుకుని సచివాలయం వైపు పరుగు
తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం భేటీ అయిన ఏపీ మంత్రి వర్గం రాజధాని వికేంద్రీకరణకు ఆమోదం తెలపడంతో దాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల ఆంక్షలను తోసిరాజని కొందరు వారిని నెట్టుకుంటూ అసెంబ్లీ వైపు పరుగుతీశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.