Nirbhaya: నిర్భయ దోషి పవన్ గుప్తా పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఘటన జరిగే సమయానికి తాను మైనర్ అంటూ పవన్ గుప్తా పిటిషన్
- పరిశీలించాల్సిన అంశాలు పిటిషన్ లో లేవన్న సుప్రీంకోర్టు
- ఫిబ్రవరి 1న దోషులకు ఉరిశిక్ష అమలు
నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిర్భయ ఘటన జరిగే సమయంలో తాను మైనర్ ను అంటూ దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో, ఫిబ్రవరి 1న నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. పవన్ గుప్తా వేసిన పిటిషన్ ను జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ ను పరిశీలించాల్సిన అంశాలేవీ ఇందులో తమకు కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్భయ దోషులంతా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఉరిశిక్షను అమలు చేయాల్సిన నేపథ్యంలో వారిని జైల్లోని మూడో నంబరు కారాగారానికి తరలించారు.