Tanjavur: తంజావూరులో టైగర్ షార్క్స్ స్క్వాడ్రన్ ఏర్పాటు... బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం ఉన్న విమానాలకు స్థానం

  • తొలిగా సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం చేరిక
  • 18 విమానాల వరకు స్క్వాడ్రన్ లో చోటు
  • బ్రహ్మోస్ క్షిపణులను మోయగలిగే విమానాలతో స్క్వాడ్రన్ బలోపేతం

భారత్ లో ఉన్న అనేక వాయుసేన స్థావరాల్లో తంజావూరు ఎయిర్ బేస్ ఒకటి. దక్షిణ భారతదేశంలో ఉన్నందున వ్యూహాత్మకంగా ఆ స్థావరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తాజాగా ఇక్కడ భారత వాయుసేన టైగర్ షార్క్స్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఆరు యుద్ధ విమానాల్ని ఈ స్క్వాడ్రన్ లో మోహరిస్తారు. ఆపై వాటి సంఖ్యను 18కి పెంచుతారు. మొదటిగా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని ఈ స్క్వాడ్రన్ లో చేర్చారు. ఈ మేరకు సుఖోయ్ విమానం తంజావూరు ఎయిర్ బేస్ కు తరలి రాగా, అక్కడి సిబ్బంది జలఫిరంగులతో ఘనస్వాగతం పలికారు. కాగా, టైగర్ షార్క్స్ స్క్వాడ్రన్ లో మోహరించే విమానాలను బ్రహ్మోస్ క్షిపణిని మోయగలిగేలా మార్పులు చేర్పులు చేశారు.

  • Loading...

More Telugu News