Dharmapuri Srinivas: మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ డి.శ్రీనివాస్ ఫైర్

  • దమ్ముంటే తనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోండని సవాల్
  • నా తల్లి చనిపోతే ఒక్క మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించలేదు  
  • ఇష్టం లేకున్నా కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సీరియస్ గా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ప్రశాంత్ రెడ్డి తలతిక్క మాటలు మానాలి అన్నారు.  కేసీఆర్ కు దమ్ముంటే తనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ను వీడి చారిత్రాత్మక తప్పిదం చేశా. తండ్రి, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లా? నా తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నాపై చేసిన విమర్శలను ఖండిస్తున్నా. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే నన్ను ఇప్పటికైనా సస్పెండ్ చేయండి. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
Dharmapuri Srinivas
Rajya Sabha MP
Minister
Prashant Reddy
Telangana

More Telugu News