Rama Rao: ఎన్టీ రామారావుగారు అలా అడగడంతో నేను ఆలోచనలో పడ్డాను: రాజేంద్రప్రసాద్
- ఎన్టీ రామారావుగారి ఇంట్లో పుట్టాను
- ఆయనతో షూటింగులకు వెళ్లేవాడిని
- ఎన్టీఆర్ తనకి ఒక మార్గాన్ని చూపించారన్న రాజేంద్రప్రసాద్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీ రామారావును గురించి ప్రస్తావించారు. 'నిమ్మకూరు'లోని ఎన్టీ రామారావుగారి ఇంట్లో నేను పుట్టాను. కాలేజ్ రోజుల్లో రామారావుగారితో కలిసి కొన్ని షూటింగులకు వెళ్లాను. ఒకసారి విజయవాడలో షూటింగు జరుగుతుండగా ఆయనకి నేను భోజనం క్యారియర్ తీసుకెళ్లాను.
'ఏం చదువుతున్నావ్?' అని ఆయన అడిగితే, 'ఇంజనీరింగ్ ఫస్టు క్లాస్ లో పాసయ్యాను' అని చెప్పాను. 'ఏం చేయాలనుకుంటున్నావ్?' అని అడిగితే, 'సినిమాల్లోకి వద్దామని అనుకుంటున్నాను' అని చెప్పాను. అప్పుడు ఆయన 'జానపదాలు .. పౌరాణికాలు చేయడానికి నేను వున్నాను. సోషల్ సినిమాలు చేయడానికి బ్రదర్ అక్కినేని వున్నారు. యాక్షన్ సినిమాలు చేయడానికి కృష్ణ .. రొమాంటిక్ మూవీస్ చేయడానికి శోభన్ బాబు వున్నారు. నీ ప్రత్యేకత ఏమిటి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్?' అని అడిగారు. ఆ మాటకు నేను ఆలోచనలో పడ్డాను. ఆ తరువాత నాకు కామెడీ కరెక్ట్ అనుకుని ఆ రూట్లో వెళ్లాను అని చెప్పుకొచ్చారు.