smart phone: స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతోన్న విద్యార్థులు పరీక్షలంటే భయపడిపోతున్నారు: పరిశోధకులు
- తేల్చి చెప్పిన బ్రిటన్‌లోని స్వాన్సీ వర్సిటీ పరిశోధకులు
- వైద్య విద్యను అభ్యసిస్తున్న 285 మందిపై అధ్యయనం
- పరీక్షల సమయంలోనూ చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్న విద్యార్థులు
స్మార్ట్‌ఫోన్లను విద్యార్థులు ఎంతగా వినియోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాటి వల్ల మానసికంగానూ విద్యార్థులకు నష్టమేనని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి. ఫోన్‌ను అధికంగా వినియోగిస్తోన్న విద్యార్థులు పరీక్షల పేరు చెబితే భయపడిపోతున్నారని తాజాగా బ్రిటన్‌లోని స్వాన్సీ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
వైద్య విద్యను అభ్యసిస్తున్న 285 మందిపై అధ్యయనం చేసి పలు విషయాలు వెల్లడించారు. ప్రతి రోజు నాలుగు గంటలకు మించి ఫోను వాడే విద్యార్థులు తాము ఒంటరి అనే భావనలో ఉంటారని అధ్యయనంలో తేల్చారు. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్, సోషల్‌మీడియాకు అధికంగా సమయం వెచ్చిస్తోన్న విద్యార్థులు సామాజిక సంబంధాలను ఏర్పర్చుకోవడంలో వెనుకబడి ఉన్నారని పరిశోధకులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా వాడుతోన్న విద్యార్థులు పరీక్షలు దగ్గరపడుతున్నప్పటికీ చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని తేల్చారు.