Nara Lokesh: ఒక రోజు మొత్తం గల్లా జయదేవ్ ను రోడ్లపై తిప్పి వేధించారు: నారా లోకేశ్
- గల్లా జయదేవ్‌ను అరెస్ట్ చెయ్యడమే కాకుండా దారుణంగా హింసించారు
- వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను
- జయదేవ్ గారి హక్కులు కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?
- చేసిన తప్పులకు పోలీసులు సమాధానం చెప్పక తప్పదు
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్ట్ చెయ్యడమే కాకుండా దారుణంగా హింసించారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఒక రోజు మొత్తం ఆయన్ని రోడ్లపై తిప్పి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్లు చేశారు.
'ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న జయదేవ్ గారి హక్కులు కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? చేసిన తప్పులకు పోలీసులు సమాధానం చెప్పక తప్పదు. ఒక వ్యక్తిపై ఇంత కక్ష సాధింపు ఎందుకు జగన్ గారు?' అని ప్రశ్నించారు.
'రాజధాని విభజన వద్దు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ మీద నిలబడమని నిలదీసినందుకు జైలుకి పంపుతారా? మరి మాట తప్పి, మడమ తిప్పిన మిమ్మల్ని ఏం చేయాలి జగన్ గారు?' అని లోకేశ్ నిలదీశారు.