Telangana: ఓటర్లను ప్రలోభపెట్టే ఫొటోలు, వీడియోలు ఉంటే ఈసీకి అందించాలి: తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి

  • మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
  • ధన ప్రభావం కట్టడికి నిఘా కొనసాగుతోంది
  • పదహారు లక్షల విలువైన మద్యం, రూ.44 లక్షలు సీజ్ చేశాం

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటే ఈసీకి అందించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. ధన ప్రభావాన్ని కట్టడి చేసేందుకే నిఘా కొనసాగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ ఓట్లను సహించేది లేదని హెచ్చరించారు.

ఇప్పటి వరకూ రూ.16 లక్షల విలువైన మద్యం, రూ.44 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. పెద్దపల్లిలో ప్రలోభాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల చరిత్ర, అఫిడవిట్ లు సంబంధిత వెబ్ సైట్ లో ఉన్నాయని వివరించారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు మొత్తం 83 వార్డులు ఏకగ్రీవం అయినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News