New Delhi: పొగమంచు ఎఫెక్ట్ : ఢిల్లీలో రైళ్లు, విమాన ప్రయాణాలకు ఆటంకం

  • ఐదు విమానాల దారి మళ్లింపు 
  • ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు 
  • ఈ రోజు ఉదయం 7 డిగ్రీల ఉష్ణోగ్రత

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేయడంతో విమానాలు, రైళ్ల ప్రయాణానికి తీవ్ర ఆటంకం నెలకొంది. ఈ రోజు ఉదయం ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోవడంతోపాటు పొగమంచు నగరాన్ని కప్పేసింది. లైట్లు వేసినా 25 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపడని పరిస్థితి నెలకొంది. పగలు కూడా రాత్రిని తలపిస్తుండడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా నడుస్తుండడంతో ట్రాఫిక్ జాం అవుతోంది. ఐదు విమానాలను విమానాశ్రయం అధికారులు దారిమళ్లించారు. ఇక రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. 22 రైళ్లు ఇప్పటికే 8 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Delhi
fog
trains
flights delay

More Telugu News