Andhra Pradesh: రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 విధించడంపై హైకోర్టులో విచారణ వాయిదా
- గ్రామాల్లో పోలీసుల మోహరింపుపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు
- విచారణ చేపట్టిన న్యాయస్థానం
- తదుపరి విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 విధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజధానిలో కఠినమైన సెక్షన్లను విధించడంపైనా, మహిళలపై దాడుల అంశాన్ని కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ జరుపుతున్నామని కోర్టుకు తెలిపారు. ఏజీ వివరణను విన్న తర్వాత తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. రాజధాని అంశంలో రైతులు, మహిళలు మాత్రమే కాకుండా న్యాయవాదులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించింది.