Akhil: అఖిల్, పూజా హెగ్డే మధ్య లవ్ సీన్స్ చిత్రీకరణ
- మళ్లీ రంగంలోకి 'బొమ్మరిల్లు' భాస్కర్
- ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన లవ్
- యూత్ ను అలరించే దేవిశ్రీ బాణీలు
అఖిల్ - పూజా హెగ్డే జంటగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ ను .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను సమంగా కలిపి అందించడంలో 'బొమ్మరిల్లు' భాస్కర్ సిద్ధహస్తుడు. రీసెంట్ గా ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో అఖిల్ - పూజా హెగ్డే పై ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు నాలుగు లవ్ సీన్స్ ను చిత్రీకరించారట.
అఖిల్ - పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, లవ్ సీన్స్ సినిమా హైలైట్స్ జాబితాలో కనిపిస్తాయని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మనసుకు హత్తుకుపోతాయని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యూత్ ను బాగా ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోతోంది. అఖిల్ కాంబినేషన్లోను ఆమె విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.