Decentralization Bill: ఇప్పుడేం చేద్దాం?: మండలి చైర్మన్ విచక్షణాధికారాలపై వైసీపీ మల్లగుల్లాలు!
- ఆయన నిర్ణయం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందని ఆరా
- అసెంబ్లీ తీర్మానంతో అధిగమించే ప్రయత్నం
- గవర్నర్ను కూడా కలవాలన్న యోచన
మూడు రాజధానుల అంశంపై ప్రవేశపెట్టిన బిల్లు మండలి చైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడంతో దీనిపై ఎలా ముందడుగు వేయాలన్న దానిపై వైసీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉదయం నుంచి ఒకటే సమీక్షలు, సమావేశాలు.
ఈరోజు ఉదయం ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మధ్యాహ్నం పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. మండలి చైర్మన్ విచక్షణాధికారం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందన్న దానిపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. దాన్ని పక్కనపెట్టి అసెంబ్లీ తీర్మానంతో బిల్లును గట్టెక్కించవచ్చా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. అదే సందర్భంలో నిన్న మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్కు వివరించాలన్న యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.