Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • డ్యాన్స్ మాస్టర్ దర్శకత్వంలో కాజల్ 
  • రజనీకాంత్ సినిమాలో సిద్ధార్థ్ 
  • ప్రభుదేవాతో సల్మాన్ మరో సినిమా 
 *  ప్రముఖ నృత్య దర్శకురాలు బృంద మాస్టర్ దర్శకత్వంలో నటించడానికి అందాలతార కాజల్ ఓకే చెప్పింది. దుల్ఖర్ సల్మాన్ హీరోగా బృంద మాస్టర్ తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం కమలహాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న హీరో సిద్ధార్థ్ తాజాగా రజనీకాంత్ నటించే చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టాడు. శివ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందే చిత్రంలో సిద్ధార్థ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తాడట.
*  ప్రభుదేవా దర్శకత్వంలో మూడవ చిత్రాన్ని కూడా చేయడానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓకే చెప్పాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'దబాంగ్ 3' రాగా, త్వరలో 'రాధే' సినిమా వస్తోంది. దీని తర్వాత 'ఏక్ థా హై టైగర్' సీరీస్ లో మూడవ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ చేస్తాడట.
Kajal Agarwal
Dulkhar
Kamal Hassan
Rajanikanth

More Telugu News