pridvi: ఎస్వీబీసీ నిర్వహణలో మార్పులు.. ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి!
- ఇటీవల చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్
- ఎస్వీబీసీకి మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించాలని యోచన
- ఖాళీగానే ఎస్వీబీసీ చైర్మన్ పదవి
ఓ ఉద్యోగినితో సినీ నటుడు పృథ్వీరాజ్ జరిపిన సరస సంభాషణ ఆడియో బయటకు రావడంతో ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పోస్టును సృష్టించి, ఆ పదవిలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించింది. ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీకి మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎస్వీబీసీ చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దాన్ని అలాగే వదిలేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.