corruption: ఏపీలో 21 తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు.. బయటపడుతోన్న అవినీతి
- కార్యాలయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తింపు
- లెక్కల్లో చూపించని రూ.4 లక్షలు స్వాధీనం
- డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్‌వోల వద్ద టైటిల్ డీడ్లు, ఈ పాస్ బుక్‌లు
- కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులతో పనులు
ఆంధ్రప్రదేశ్‌లోని అవినీతి తహసీల్దార్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ రోజు 21 తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేసి, కార్యాలయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు.
లెక్కల్లో చూపించని రూ.4 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్‌వోల వద్ద టైటిల్ డీడ్లు, ఈ పాస్ బుక్‌లు, అపరిష్కృతంగా ఉన్న వివిధ రకాల ప్రజా దరఖాస్తులు గుర్తించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు.