Voter card: ఇక ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం.. న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్

  • బడ్జెట్ సమావేశాల్లో మంత్రి మండలి ముందుకు కేబినెట్ నోట్
  • అమల్లోకి వస్తే పాత, కొత్త కార్డుదారులు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిందే
  • ఇవ్వకపోయినా కార్డు రద్దు చేసే అధికారం ఈఆర్‌వోలకు ఉండదు

పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతాలను ఇప్పటికే ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఓటర్‌కార్డును కూడా ఆధార్‌తో లింక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు వీలుగా కేబినెట్ నోట్‌ను రూపొందిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో దీనిని మంత్రి మండలి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఆధార్-ఓటర్‌కార్డు అనుసంధానం మొదలైతే ఇప్పటికే ఓటర్ కార్డు కలిగిన వారు ఆధార్‌ నంబరును సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా ఆధార్ వివరాలను అడిగేందుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు (ఈఆర్‌వో) అధికారం వస్తుంది. అయితే, ఆ వివరాలు ఇవ్వనప్పటికీ కొత్త కార్డును తిరస్కరించడం కానీ, పాత కార్డును తొలగించే హక్కు కానీ ఈఆర్‌వోలకు ఉండదు. ఈ విధానం అమల్లోకి వస్తే బోగస్ కార్డులను ఏరివేసే వీలు చిక్కుతుందని ఈసీ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News