China: అష్టదిగ్బంధంలో చైనా.. 26కు చేరిన 'కరోనా' మృతులు

  • చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్
  • అష్టదిగ్బంధంలో 13 నగరాలు
  • చైనాలోని భాతర ఎంబసీలో రిపబ్లిక్ డే వేడుకల రద్దు

కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య చైనాలో 26కు చేరింది. అంతేకాదు, మరో 880 మంది ఈ వైరస్ బారినపడినట్టు అధికారులు గుర్తించారు. ప్రమాదకరంగా మారిన ఈ వైరస్‌ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మొత్తం 13 నగరాలను అష్టదిగ్బంధం చేసింది. ఆయా నగరాల్లోని ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం నిలిపివేసింది. దీంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎటూ కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు, కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో దేశంలో ఎక్కడా కొత్త సంవత్సర వేడుకల జాడ కనిపించలేదు. చైనా కొత్త సంవత్సరమైన మూషిక ఏడాది నేటి నుంచే ప్రారంభమైంది. చైనాలో ఇది అతిపెద్ద పండుగ అయినప్పటికీ ఎక్కడా సందడి లేదు. వ్యాధి మరింత విస్తరించకుండా చేపట్టే చర్యల కోసం ప్రభుత్వం వంద కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1008 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలోకి దించారు. ఇక, చైనాలోని భారత రాయబార కార్యాలయంలో రేపు జరగాల్సిన భారత రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News