India: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్
- అగ్రస్థానంలో చైనా
- అమెరికాను వెనక్కినెట్టిన భారత్
- 2019లో 158 మిలియన్ స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు, దిగుమతులు
భారత్ లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం గణనీయంగా పెరిగింది. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు దేశంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించింది. గతేడాది భారత్ లో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు, దిగుమతుల సంఖ్య 158 మిలియన్లు. 2018తో పోల్చితే ఇది 7 శాతం అధికం. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు భారత్ జోరుతో మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తన లేటెస్ట్ రిపోర్టులో పేర్కొంది.
ఇక గతేడాది భారత్ లో చైనా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల వాటా 72 శాతంగా నమోదైంది. బ్రాండ్ల పరంగా చూస్తే షియోమీ ఫోన్లదే అగ్రస్థానం. ఈ సంస్థ ఫోన్లు 28 శాతం అమ్ముడవగా, ఆ తర్వాత 21 శాతం అమ్మకాలతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. ఇతర ప్రధాన బ్రాండ్లయిన వివో (16 శాతం), రియల్ మీ (10 శాతం), ఒప్పో (9 శాతం) కూడా మార్కెట్ లో తమ పట్టు నిరూపించుకున్నాయి.